ఇంటర్నెట్ దగ్గర నుంచి టెక్నాలజీ వరకు, మీకు తెలియని ఆసక్తికర నిజాలు
ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ స్పూర్తితో, ప్రపంచవ్యాప్తంగా 58శాతం జనాభా తమ భవిష్యత్ గరించి ఆలోచించటం ప్రారంభిస్తోంది.
తొలినాళ్లలో ఇంటర్నెట్‌ను శాస్త్రవేత్తలు మాత్రమే ఉపయోగించుకునేవారు. ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం, ఇమేజ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవటం వంటి పనులను ఇంటర్నెట్ ద్వారా శాస్త్రవేత్తలు చక్కబెట్టుకునేవారు.
ఆ రోజుల్లో ఇంటర్నెట్‌ని వినియోగించుకోవాలంటే.. 1990లలో ఇంటర్నెట్‌ని వినియోగించుకోవాలంటే చాలా శ్రమపడాల్సి వచ్చేది. ఇంటర్నెట్ యాక్సెస్‌ను సులభతరం చేసిన సామన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటే..? ఎఫ్‌టిపి, యూజ్‌నెట్, టెలినెట్, గోపెయిర్ లాంటి వివిధ ప్రోటోకాల్స్ సమ్మేళణంతో కూడిన ఇంటర్నెట్ అప్లికేషన్ అవసరమయ్యింది.
మోజైక్ ప్రోగ్రామింగ్.. ఈ అంశం పై దృష్టిసారించిన అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ సూపర్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ (ఎన్‌సిఎస్‌ఎ) ఉద్యోగులైన మార్క్ అండ్రీసిన్, ఎరిక్ బీనాలు 1992 డిసెంబర్‌లో ఆరు వారాల పాటు శ్రమించి ఓ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసారు. దానికి మోజైక్ అని పేరు పెట్టారు. 1993 జనవరిలో అధికారికంగా మోజైక్ యాప్ విడుదలయ్యింది. మోజైక్ విడుదలతో ఇంటర్నెట్ యాక్సెస్‌లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది.
గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (జియుఐ)తో రూపొందించబడిన ఈ ప్రోగ్రామ్ ద్వారా మౌస్‌ని వినియోగించి పాయింట్ - అండ్ - క్లిక్ అనే పద్ధతితో కంప్యూటర్, ఇంటర్నెట్ మీద పెద్దగా అవగాహన లేనివారు సైతం ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం ఎంతో సులభతరమైంది.
No comments:
Post a Comment